Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం... ఎక్కడంటే...!

Chandrababu will take oath on June 12
Advertisement
  • ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం
  • 164 స్థానాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభంజనం
  • నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు
  • గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణస్వీకారం
  • హాజరుకానున్న ప్రధాని మోదీ, పలువురు సీఎంలు
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం వేదిక, సమయం ఖరారు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. 

టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని పరిశీలించారు. కాగా, చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

టీడీపీ నేతలు తొలుత మంగళగిరి ఎయిమ్స్ వద్ద స్థలాన్ని పరిశీలించినప్పటికీ... అది అనువుగా లేకపోవడంతో గన్నవరం స్థలాన్ని ఖరారు చేశారు.
Advertisement
Advertisement
Chandrababu
Oath Taking Ceremony
Gannavaram
TDP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News